ధౌర్భాగ్యపు వ్యవస్థ.. నలుగురు హంతకులకు మటన్?

గల్ఫ్ సహా కొన్ని దేశాల్లో ఇలా బాలికలను – మహిళలను అత్యాచారం చేస్తే నడిరోడ్డుపై తలలు నరికేస్తూ ఊరితీస్తూ జనంలో ఆ క్రైమ్ చేయడానికే భయపడేలా చేస్తారు. కానీ ఇది భారత దేశం.. సహనం – శాంతి అంటూ మనల్ని మనం శాంతపరచుకుంటున్నాం. కానీ మృగాళ్లకు ఈ శాంతి సరిపోవడం లేదు. వారి కృరత్వం బయటపడుతున్నా.? మానవమృగాలుగా సమాజంపై పడి కబళిస్తున్నా వారిని ఇంకా భరిస్తూ రాచమర్యాదలు చేస్తున్న సమాజం మనది.

ఢిల్లీలో నిర్భయను అత్చాచారం చేసి చంపిన వారిని సైతం జైల్లో పెట్టి రాచమర్యాదలు చేసినటువంటి ధైర్భాగ్యపు వ్యవస్థ మనది.. తాజాగా హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు నిందితులకు ఆదివారం ఉదయం పులిహోర మధ్యాహ్నం మటన్ తో భోజనం అందించారట.. 250 గ్రాముల మటన్ ను పెట్టి మేపారాట.. ఈ విషయం బయటకు తెలిసే సరికి నిరసనకారుల్లో మరింత ఆవేశం పెల్లుబుకింది.. ఇలా కరుడుగట్టిన ఈ కామాంధులను వెంటనే శిక్షించాల్సింది పోయి జైలులో ఇలా మేపుతున్న వైనమే జనంలో ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది.

మన చట్టాలు న్యాయాలు ఇంత ఉదాసీనంగా ఉన్నంత కాలం.. ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఆదివారం సింగిల్ సెల్లో ఉన్న ఈ నలుగురు మృగాళ్లకు కనీసం తాము ఆడపిల్లను చంపామన్న సానుభూతి ఆందోళన పశ్చాత్తాపం మచ్చుకైనా కనిపించలేదని జైలు అధికారులు తెలిపారు. ఇలాంటి క్రూరులను ఇంకా భరిస్తున్న మన సమాజాన్ని చట్టాలుు న్యాయాలను చూసి కుమిలిపోవడం తప్ప మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడమే మన ధైర్భాగ్యం..

ఇప్పటికైనా ఇలాంటి వారిని వెంటనే శిక్షించేలా మన న్యాయ చట్టాలు మారిస్తేనే ఇలాంటి క్రైమ్ లు చేయడానికి క్రిమినల్స్ భయపడే పరిస్థితి వస్తుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *