అల్లు అర్హ నెక్స్ట్ సూపర్ స్టార్.. కన్ఫర్మ్ చేసిన సమంత అక్కినేని..

ఇండియాలో కపూర్ కుటుంబం తర్వాత కేవలం అల్లు కుటుంబంలో మాత్రమే నాలుగు జనరేషన్స్ నటులు ఉన్నారు. చాలా చిన్న వయసులోనే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి వచ్చేస్తుంది. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో బాల భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. అల్లు కుటుంబం నుంచి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ తర్వాత నాలుగో తరం అర్హ. ఈమె ఎంట్రీతో అల్లు వారి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ మధ్యే శాకుంతలం సినిమా షూటింగ్ లో అడుగు పెట్టింది అల్లు అర్హ. ప్రస్తుతం ఈ చిన్నారితో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు గుణశేఖర్. ఈ మైథలాజికల్ లవ్ డ్రామాలో సమంత అక్కినేనితో పాటు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శాకుంతలం షూటింగ్ లో అడుగు పెట్టగానే అల్లు అర్హకు సమంత రూపంలో ఒక పెద్ద అభిమాని దొరికారు.

అల్లు అర్హ నటన గురించి ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంది సమంత అక్కినేని. తన డైలాగ్స్ అన్నీ కేవలం ఒకే టేక్ లో పూర్తి చేసింది.. ఫస్ట్ టేక్ లోనే అద్భుతమైన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఫ్యూచర్లో మనకు ఒక సూపర్ స్టార్ వచ్చేసింది.. గాడ్ బ్లెస్ అంటూ అల్లు అర్హ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత అక్కినేని.

అల్లు శిరీష్ కూడా అల్లు అర్హ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. అర్హ ఖచ్చితంగా తమ అందరినీ గర్వపడే స్థాయికి తీసుకెళ్తుందని నమ్మకంగా చెప్పారు శిరీష్. శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటిస్తున్న చిన్నారి అర్హకు ఆల్ ద బెస్ట్ చెప్పారు ముద్దుల బాబాయ్.

అల్లు అర్హకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంజలి టైటిల్ సాంగ్ తో ఈ చిన్నారికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో 15 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అంజలి టైటిల్ సాంగ్ లో అద్భుతమైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరినీ తన చూపులతో కట్టి పడేసింది అల్లు అర్హ. ఇప్పుడు చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో అర్హ సూపర్ స్టార్ స్థాయికి వెళ్లడం కన్ఫర్మ్ అని అందరూ దీవిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *