రాహుల్ గాంధీని పబ్లిక్ లో కొట్టాలి

హిందుత్వ యోధుడు.. నేటి బీజేపీ శివసేన పుట్టికకు పరోక్ష కారకుడు వీడీ సావర్కర్. ఈ హిందుత్వవాదిపై తాజాగా రాహుల్ గాంధీ సంచలన ఆరోపనలు చేసిన సంగతి తెలిసిందే.. తాను రాహుల్ సావర్కర్ కాదు.. రాహుల్ గాంధీ అంటూ ఢిల్లీలో నినదించాడు. ఈ వ్యాఖ్యలను హిందుత్వ బీజేపీ తీవ్రంగా దుయ్యబట్టింది.

తాజాగా వీడీ సావర్కర్ ను అవమానించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిలబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కోరారు. గతంలో సావర్కర్ ను అవమానిస్తే పబ్లిక్ లో కొట్టాలని ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చి విషయాన్ని రంజిత్ గుర్తు చేసి డిమాండ్ చేశారు.

ఇక ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా స్పందించారు. బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం హిందూవాద నాయకుడైన వీర్ సావర్కర్ ఆలోచనలకు భిన్నమైనదని అన్నారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం వ్యవసాయ కష్టాలురేప్ లను కప్పిపుచ్చేందుకే బీజేపీ పౌరసత్వ సవరణ బిల్లును తెచ్చిందని ఉద్దవ్ ఆరోపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే  దేశం ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని.. ఆయన ఆలోచనలకు తూట్లు పొడిచేలా బీజేపీ బిల్లు ఉందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *