నో ఛాలెంజెస్…. నో ప్రచారం… ఓన్లీ వర్క్…. ఇది నేటి పోలవరం ప్రాజెక్ట్ దృశ్యం….

రాసుకో జగన్ 2018 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం… సాగు నీరు ఇస్తాం అనే రెచ్చగొట్టే సవాళ్లు లేవు, ప్రతి సోమవారం పోలవరం అనే హడావిడి అంతకన్నా లేదు. 20 మీటర్ల ఎత్తు కూడా పూర్తి కాని పియర్స్ మధ్యలో గేట్స్ బిగింపు అనే ప్రచారార్భాటం అస్సలు కనిపించటం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతం లో వేలాది కార్మికులు నిబద్దతతో పనిచేస్తున్న శ్రమైక జీవన సౌందర్యం, ఆకాశం నుంచి చూస్తే చీమల్లా కనిపించే వందలాది వాహనాల రాకపోకలు ప్రస్తుతం కనిపిస్తోంది. ముఖ్య మంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తండ్రి రాజశేఖర రెడ్డి శంఖుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రివర్స్ టెండరింగ్ లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ కు అప్పగించారు. అప్పటి నుంచి రేయనక, పగలనక, ఎండనక, వాన అనక , కరోనా వంటి విపత్కర పరిస్థితులనుకూడా అధిగమించి పనులను మేఘా సంస్థ, ప్రభుత్వం సమన్వయంతో చేసుకుంటూ పోతున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, డిజైన్ల ఆమోదం అన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కేంద్ర జలవనరుల సంఘం, డ్యామ్, డిజైన్ రివ్యూ ప్యానెల్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలు అప్పగించిన బాధ్యతలను మాత్రమే నెరవేరుస్తుంది. ఆ బాధ్యతను ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం నెరవేరుస్తోంది. జలాశయ పరిరక్షణ, దాని ద్వారా సరైన ప్రయోజనాలు సాధించే దిశగా పనుల పరిమాణంను జలసంఘం గణనీయంగా పెంచింది. జల సంఘం సవరించిన మార్పులు, చేర్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనుల అంచనాలను సవరించింది. 1656 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. గతం లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కూడా పోలవరం అంచనాలు పెంచింది. ఓ వైపు లక్ష్యాన్ని అధిగమించి పాత పనులు చేయటం తో పాటు , మరోవైపు అవసరమైన మేరకు కొత్త పనులు చేపట్టడం పోలవరంలో ప్రత్యేకత.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఒకటి కానుంది. ఆ నిర్మాణంలో వేలాది మంది కార్మికులు, అత్యాధునిక యంత్రాలు, లారీలు, టిప్పర్లు,డోజర్లు, వాటిరణగొణ ధ్వనులు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. గోదావరి వరద సమయంలో నీతితో యెంత నిండుగా కనిపిస్తోందో ఇపుడు ఇంజినీరింగ్ సిబ్బంది, యంత్రాలు, కార్మికులతో అంట నిండుగా కనిపిస్తోంది.

2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రతి సోమవారం సమీక్షలు, ఆ సమీక్షల ముగిసిన వెంటనే మళ్ళి సిద్ధం కావటం, గ్రాఫిక్స్ మాత్రమే కనిపించేయి. 2019 నవంబర్ తోలి వారం వరకు 20 మీటర్లకు మించి లెగవని పోలవరం స్పిల్ వే పియర్స్ మొండి గోడల్లా కనిపించేయి. ఐ[ఇపుడు అక్కడకు వెళ్లిన వారికి అప్పటికి ఇప్పటికి నిర్మాణంలో యెంత తేడా అనిపించక మానదు. 2018 డిసెంబర్ 25న అప్పటి సి ఎం చంద్రబాబు 20 మీటర్ల ఎత్తు లేచి పియర్స్ మధ్య రేకులను నిర్మించి ఇదే గేట్ అని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇపుడు పూర్తయిన గేట్స్ ను చూస్తే వాస్తవం ఏంటో అర్ధం అవుతుంది. గతంలో ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధంగా, లోపాలు, అక్రమాలు, వైఫల్యాలతో పని జరిగింది. అయితే ఇపుడు అవి దరిదాపుల్లో లేవు. కాలంతో పోటీ పడి పనులు ఓ యజ్ఞం లా జరుగుతున్నాయి. ప్రభుత్వం, అధికారుల సహకారంతో మేఘా సంస్థ నిర్మాణ పనులను పరిగెత్తిస్తోంది.

గత ఏడాది ఏప్రిల్ 20 నుంచి ఈ ఏడాది 21 మార్చి వరకు 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా మేఘా సంస్థ 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని చేసి తన సత్తా చాటింది. గత ఏడాది కరోనా వ్యాధి ఉదృతంగా ఉన్న మే లో 85300, జూన్లో 120100, ఈ ఏడాది ఫిబ్రవరిలో 82956, మార్చిలో 81204 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేల మేఘా ఇంజనీరింగ్ సంస్థ పని చేసింది.

గత సంవత్సరంలో మేలో 53 వేలు, జూన్-2020లో 70 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 205400 క్యూబిక్ మీటర్ల పనిని మేఘా పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి లో 47 వేల క్యూబిక్ మీటర్లకు గాను 83 వేల క్యూబిక్ మీటర్లు , మార్చి నెలలో 68,600 క్యూబిక్ మీటర్లకు గాను 81,200 క్యూబిక్ మీటర్ల పనితో అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

అప్రోచ్ ఛానల్ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే….
పోలవరం ప్రాజెక్ట్ లో ప్రస్తుతం కీలకమైనవి అప్రోచ్ ఛానల్ పనులు. మరో రెండు నెలల్లో గోదావరికి వరద వస్తుంది. అపుడు నదీ ప్రవాహాన్ని మార్చకుండా పనులు చేయాలంటే కష్టం. అందుకే నది దిశను మార్చేందుకు అప్రోచ్ పనులను మేఘా సంస్థ ప్రణాళిక బద్దంగా చేస్తోంది. అప్రోచ్ ఛానల్ పనుల్లో ప్రస్తుతం 300 టిప్పర్లు, 100 ఎక్సకావేటర్లు నిమగ్నమై 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని పూర్తి చేశాయంటే మెగా సంస్థ తో పాటు ప్రభుత్వం ఈ పనికి యెంత ప్రాధాన్యత్స్ ఇస్తుంది అర్ధం అవుతుంది. అప్పర్ కాఫర్ డ్యాంలో నీరు ప్రవహించే ప్రాంతాలను మూసివేసి గోదావరిని సహజ ప్రవాహం నుంచి కుడి వైపునకు 6 కిలోమీటర్ల మేర మళ్ళించాలంటే అప్రోచ్ చానెల్కీ లకమైనది కాబట్టే ఆగమేఘాల మీద పనులు సాగుతున్నాయి. కేంద్ర జలసంఘం చెప్పిన విధంగా ఈ పనులు జరుగుతున్నాయి.

తుది దశలో స్పిల్ వే పనులు. …
ఇప్పటికే స్లాబ్ పూర్తి చేసుకున్న పోలవరం స్పిల్ వే బ్రిడ్జిలో మిగిలిన పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. స్పిల్ వేలో 2,82,276 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని ఇప్పటికి పూర్తి ఐంది. ప్రస్తుతం స్పిల్ వే లో కాంక్రీట్ , గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయి. స్పిల్ వే బ్రిడ్జిలో 48 గేట్లకు 42 గేట్ల అమరిక పూర్తి ఐంది. గేట్లను ఆపరేట్ చేసేందుకు 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గాను 84 అమర్చారు. మిగిలిన 12 జర్మనీ నుంచి రావాలి . గేట్లను ఆపరేట్ చేయటం లో కీలక మైన వి పవర్ ప్యాక్ లు. 24 పవర్ ప్యాక్ లకు గానూ ఇప్పటికే 13 అమర్చారు.ఒక్కో పవర్ ప్యాక్ తో రెండు గేట్లను ఆపరేట్ చేయవచ్చు. స్పిల్ వేలో 10 రివర్స్ స్లుఈజ్ గేట్లను అమర్చటం జరిగింది. వీటికి, 20 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. 10కి గాను 6 పవర్ ప్యాక్ లను ఏర్పాటు చేయగా 4 పవర్ ప్యాక్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఆ తప్పులను సరిచేసుకుంటూ…
రికార్డులు, ప్రచారం కోసం తమకు ఇష్టమైన రీతిలో చంద్రబాబు కాఫర్ డ్యామ్ పనులను చేయించారు. అలా చేయటం వాళ్ళ వరదలకు కాఫర్ డ్యామ్ దెబ్బతింది. ఇపుడు ఆ పనులు సరిదిద్దుతూ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని ప్రభుత్వం కాఫర్ డ్యామ్ పనులను వేగంగా చేయిస్తోంది. అప్పర్ కాఫర్ డ్యామ్ లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయటం తో పాటు రాక్ ఫిల్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రీచ్ 1లో 35 మీటర్ల ఎట్టు నిర్మాణం పూర్తి కాగా, రీచ్ 2 లో 42. 5 మీటర్ల ఎట్టు నిర్మించే పనులు జరుగుతున్నాయి. రీచ్ 3లో గోదావరికి అడ్డుకట్ట వేసే పనులు, 4 లో రాక్ ఫిల్లింగ్ పనులు వేగంగా చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. అప్పర్ కాపర్ డ్యామ్ లో ఇప్పటికి 577676 క్యూబిక్ మీటర్ల పని జరిగింది.

గ్యాప్-2 లో ఏం పనులు జరుగుతున్నాయి అంటే….
ప్రాజెక్ట్ గ్యాప్-2 లో ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్, 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కీలకమైనది. గోదావరి నది ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మిస్తారు. ఇక్కడ రాతినేల లోతులో ఉండడం వల్ల నిర్మాణ పటిష్ఠతకు కేంద్ర జలసంఘం ఆధీనంలోని డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్సూచనల మేరకు ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. వరదలను అధిగమించి స్పిల్ ఛానెల్ లో ఇప్పటికె 22,7,900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 28,41785 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు మేఘా సంస్థ పూర్తి చేసింది పోలవరంలో ప్రాజెక్ట్ లో మరో కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 4,48,487 క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *