పరుగులు పెడుతున్న పోలవరం

పడకేసిన పోలవరం అంటూ ప్రతిపక్షాలు వేలెత్తిచూపితే వాళ్ళ కళ్ళుబయ్యర్లు కమ్మేలా శరవేగంగా పనులను పరుగులు పెట్టిస్తోంది ఎపి ప్రభుత్వం.గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా,నత్తనడకన పనులు చేసి ప్రాజెక్ట్ పై ఆశలు సన్నగిల్లేలా చేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనవసర ఆర్బాటాలకు పోకుండా గతంలో జరిగిన తప్పులను సవరించుకుంటూ శరవేగంగా శాస్త్రీయ బద్దంగా పనులు జరిగేలా ఇంజనీర్లకు,కాంట్రాక్టర్ కు అన్నివిధాలుగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు

ప్రస్తుతం పనులు చేయడానికి ఈ సీజన్ ఎంతో అనువైనది కావడంతో దీనిని సద్వినియోగం చేసుకునేందుకు కాంట్రాక్ట్ సంస్ద మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా)పూర్తి స్దాయిలో తన శక్తియుక్తులను ప్రాజెక్ట్ లో కేంద్రీకరించింది.ఇచ్చిన గడువు కంటే ముందుగానే పనులు పూర్తిచేయగలదు అనే పేరు సంపాదించుకున్న మేఘా అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వ సహకారంతో శరవేగంగా పనులు చేసుకుంటూ దూసుకుపోతుంది.తక్కువ కాలంలోనే ప్రాజెక్ట్ లోని స్పిల్ వేకు సంబందించి 62818 ఘనపు మీటర్ల పనిని పూర్తి చేయడంతో పాటు మిగిలిన పనులను కూడా యుద్దప్రాతిపదికన చేసేందుకు రంగం సిద్దం చేసుకుంది.గోదావరి నడిఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ (VIBRO COMPACTION WORKS UNDER PROGRESS) పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం చేసింది మేఘా.

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఊపందుకున్న పనులు;
ప్రాజెక్ట్ నిర్మాణంలో ఓవైపు పనులు చేసుకుంటూనే మరోవైపు శాస్త్రీయ పద్దతిలో ప్రాజెక్ట్ కు సంబందించిన డిజైన్ల అనుమతులు పొందడం కూడా కీలకం.సరైన సమయంలో చేయాల్సిన పనులకు సంబందించిన డిజైన్ల అనుమతులు పొందలేకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదుంటూ ఇటీవల ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్ళింది మేఘా యాజమాన్యం.డిజైన్లకు సంబందించిన అనుమతులు త్వరగా మంజూరు చేస్తే నిర్దేశించిన గడువు ప్రకారం పనులను పూర్తిచేస్తామని సిఎంకు స్పష్టం చేసింది మేఘా కంపెనీ.దీంతో డిజైన్ల అనుమతులు పొందేందుకు అటు ఢిల్లీలోను,హైదరాబాద్ లోను ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.అప్పటి నుండి పనులు శాస్త్రీయ పద్దతుల్లో ఊపందుకున్నాయి.నిజానికి ప్రాజెక్ట్ నిర్మాణంలో పాటించాల్సిన నియమనిబందనలు,విధానాలు(ఇంజనీరింగ్)స్పష్టంగా ఉన్నా గత ప్రభుత్వం వాటిని ఏమాత్రం పాటించలేదు.పైగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా సంక్లిష్టం చేసి కొద్దిపాటి వరదలకే ప్రాజెక్ట్ లోకి నీరు చేరడమే కాకుండా గ్రామాలు మునిగిపోయే పరిస్దితిని తీసుకొచ్చింది.ఇప్పుడా సమస్యను చక్కదిద్దే విధంగా పనులు వేగవంతమయ్యాయి.
అశాస్త్రీయంగా కాఫర్ డ్యాం నిర్మాణం వల్లే పనులు ఆలస్యం;
రివర్స్ టెండరింగ్ తరువాత పోలవరం పనులు దక్కించుకున్న మేఘా సంస్ద వెంటనే పనులు మొదలెట్టడానికి సాధ్యపడలేదు.గత ప్రభుత్వం నాన్ ఇంజనీరింగ్ పద్దతుల్లో కాఫర్ డ్యాం నిర్మించడంతో ముంపు సమస్య తలెత్తి దాదాపు మూడునెలల విలువైన సమయం కోల్పోవలసి వచ్చింది.అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ముందుగా కాఫర్ డ్యాంను పూర్తి చేసి ఎంతో కొంత నీటిని నిల్వచేసి దాని నుండి కుడి,ఎడమ కాలువలకు వరద సమయంలో నీటిని విడుదల చేసి పాక్షికంగా ప్రాజెక్ట్ పూర్తిచేశామనిపించుకునేందుకు ప్రయత్నించారు.నిజానికి ఇది ఇంజనీరింగ్ విధానాలకు వ్యతిరేఖం.పైగా కేంద్రం కూడా అప్పట్లో ఆయన వత్తిడికి తలొగ్గి 42.5మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యాం నిర్మించుందకు అంగీకరించడం మరింత నష్టం చేకూర్చింది.ఇంతవరకూ ఏజలాశయ నిర్మాణాల్లోనూ లేనివిధంగా పోలవరంలో మాత్రమే ఈవిధమైన అనుమతి లభించింది.కాఫర్ డ్యాం అనేది ప్రధాన జలాశయం నిర్మాణం జరిగేటప్పుడు నీరు అడ్డురాకుండా నదీప్రవాహాన్ని మళ్ళించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం.దీనివల్ల గతేడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనుల నిలిచిపోవడమే కాకుండా రహదారులు కూడా కొట్టుకుపోయాయి.కనీసం 4టిఎంసీల నీరు నిలువ ఉండటంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యంకాని పరిస్దితుల్లో 3నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి వరదనీటిని తరలించాల్సి వచ్చింది.ప్రాజెక్టులో అన్నిపనులకు ఇంజనీరింగ్ పద్దతుల్లో సమప్రాధాన్యత ఇవ్వాలి,కానీ గత ప్రభుత్వం స్పిల్ వే తో పాటు కాఫర్ డ్యామ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది.ఈప్రాజెక్ట్ లో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్(ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్ లు,స్పిల్ వే,స్పిల్ ఛానల్,అప్రోచ్ ఛానెల్,ఫైలెట్ ఛానెల్,కుడి,ఎడమ కాలువల అనుసంధానంతో పాటు జలవిధ్యుత్ కేంద్రం కీలకమైనవి.వీటిల్లో చాలా పనులు అసలు గత ప్రభుత్వం చేపట్టనేలేదు.జలవిధ్యుత్ కేంద్రంలో గంపమట్టికూడా తీయలేదంటే ఎంత నిర్లక్ష్యం చేసిందో అర్దమౌతుంది.

వేగం పెంచిన మేఘా;
జనవరి నుండే స్పిల్ వేలో పనులు వేగం చేసిన మేఘా ఇంజనీరింగ్ ఈ ఆరు నెలలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21 వేలకు పైగా ఘ.మీ పనిని పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే బీమ్ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్వాల్ పనులను ఉదృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాప్ లు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి.

నిజానికి చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ పనితక్కువ ప్రచారమెక్కువ అన్నట్లు నడిచింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్లో కీలకమైన అనుమతులన్నీ అప్పుడే సాధించారాయన. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు. వైయస్ పాలనలోనే దాదాపు కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో 2010 నుంచి 2019 వరకు కేవలం స్పిల్వేలో కొంత పనితోపాటు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ మాత్రమే నిర్మించారు. ఇంతకు మించి అప్పుడు జరిగిందేమీ లేదు.

డిజైన్ల అనుమతుల పై ప్రత్యేక ద్రుష్టిపెట్టిన జగన్ సర్కార్;

జగన్ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగం చేయించడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో కీలకమైన డిజైన్ల అనుమతుల పై ప్రత్యేక ద్రుష్టి సారించారు. గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయడంతో, మొత్తం ప్రాజెక్ట్లో 45 డిజైన్లు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి లభించలేదు. ఇవి ప్రాజెక్ట్లో ముఖ్యమైనవి. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రాజెక్ట్ పనిని సమీక్షించి ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర జల సంఘం ఆధీనంలోని ప్రాజెక్ట్ అథారిటీ కమిటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మార్చి 8న హైదరాబాద్లో ప్రాజెక్ట్ డిజైన్ల కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించడం ద్వారా పెండింగ్ లో ఉన్న 8 డిజైన్లకు సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదనలను డ్యామ్ డిజైన్ల సమీక్ష బృందం పరిశీలించి కొన్నింటిని తిరస్కరించింది. ముఖ్యంగా ఆనకట్ట (ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్) మూడో గ్యాపులో మట్టికట్ట నిర్మించాలనే ప్రతిపాదనను నిర్ద్వంధంగా తోసిపుచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా కాంక్రిట్ నిర్మాణం చేపడితేనే ప్రాజెక్ట్ వరదల సమయంలో పటిష్టంగా ఉంటుందని తేల్చిచెప్పింది. ఇంజనీరింగ్ నిపుణులకు ఈ విధమైన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు అతీతంగా ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ప్రాజెక్ట్ డిజైన్ల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని సీడబ్ల్యూసి చైర్మన్ ఏ.డి.పాండ్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. దాంతో పెండింగ్ లో ఉండిపోయిన అప్రోచ్ ఛానెల్ ఎడమగట్టుపై ర్యాక్ ఫిల్ గైడ్వాల్ నిర్మించడం, స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఎడమ గట్టువైపు పటిష్టమైన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ రూపొందించాలని నిర్ణయించింది. అదే విధంగా స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద నీరు కుడిగట్టుపై పడుతుంది. దీనికి కూడా పటిష్టమైన డిజైన్ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. స్పిల్ ఛానెల్ నుంచి వరద నీరు పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరి నదిలోకి కలిసే పనులకు సంబంధించి డిజైన్ను కేంద్ర జలసంఘానికి ప్రాజెక్ట్ అధికారులు సమర్పించారు. దీనికి త్వరితగతిన అనుమతి సాధించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్లో ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విధంగా అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. మొత్తానికి ఇక పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *