క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6కి పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హైదరాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని తుల‌సి వ‌నం శ్రీవెంక‌టేశ్వ‌ర దైవ స‌న్నిధానంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజేత వంటి క్లాసిక్ హిట్ అందుక‌ని ప్ర‌స్తుతం సూప‌ర్ మచ్చి అనే క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్న క‌ళ్యాణ్ దేవ్ నుంచి మూడో సినిమాగా ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 రాబోతుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ఛ‌లో, భిష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే పూర్తి చేసుకొని సెట్స్ మీద‌కు సినిమాను తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళి కానుకగా నవంబ‌ర్ 14న ఉద‌యం 10గంల‌కు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లుగా నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల, యువ ద‌ర్శ‌కులు ప్ర‌ణీత్, వేణు ఉడుగ‌ల ముఖ్య అతిధులుగా విచ్చేసి, చిత్ర బృందానికి శుభాభినంద‌న‌లు తెలిపారు

రామ్ త‌ళ్లూరి ప్రొడ‌క్ష‌న్
బ్యానర్ – ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
స‌మ‌ర్ప‌ణ – సాయిరిషిక‌
నిర్మాత – రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌
క‌థ, క‌థ‌నం – దేశ్ రాజ్ సాయితేజ్
సంగీతం – మ‌హతి సాగ‌ర్
సినిమాటోగ్రాఫర్ – సురేశ్ ర‌ఘుతు
ఎడిటింగ్ – అన్వ‌ర్ అలీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్ – శ్రీ నాగేంద్ర తంగ‌ల‌
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
ద‌ర్శ‌కుడు – ర‌మ‌ణ తేజ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *