ఇంకా నాలుగున్నరేళ్ళు చంద్రబాబు పరిస్థితి ఇంతేనా ?

తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. టీడీపీ చరిత్రలో అంతటి ఘోర ఓటమిని చూసింది లేదు. దీనితో అధినేత చంద్రబాబు చాలా క్రుంగిపోయారు. ఆ తరువాత ఆయనకి షాకులు ఇస్తూ పలువురు టీడీపీ కీలకనేతలు వైసీపీ బీజేపీలోకి జంప్ అయ్యారు. పార్టీ నిర్మాణం కోసం ఒకవైపు బాబు బలంగా ప్రయత్నాలు చేస్తుంటే ..మరోవైపు సొంత పార్టీ నేతలే షాకులిస్తుండటం తో బాబు అయోమయం లో పడిపోయారు.

ఈ సంగతి పక్కన పట్టి ..బాబు మళ్లీ ప్రజలని అయిన ఆకట్టుకుందాం అని ప్రజాబాట పడితే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ .. గత వారం అమరావతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు ఆదిలోనే షాక్ తగిలింది.  రాజధాని ప్రాంతానికి అలా చేరుకున్నారో లేదో ఇలా నిరసన పర్యం మొదలైంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆయన ప్రయాణించిన బస్సుపై రాళ్ళు చెప్పులు విసిరి గో బ్యాక్ బాబు  అంటూ నినాదాలు చేశారు. రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేసి . ఇప్పుడు  ఏ మొఖం పెట్టుకొని మళ్లీ ఇక్కడకి వస్తున్నారంటూ కొందరు రైతులు ఆరోపించారు.

ఇక ఏదేదో అనుకోకుండా జరిగిందిలే అనుకుంటే ..తాజాగా బాబుకి మరో పరాభవం ఎదురైంది. పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా పర్యటన చేస్తున్న బాబు .తాజాగా కర్నూల్ జిల్లాకి వెళ్లారు. కర్నూలు పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు అక్కడ హైకోర్టు సాధన సమితికి సంబంధించిన జెఎసి నిరసనలతో స్వాగతం పలికింది. కర్నూలులో వినిపిస్తున్న హైకోర్టు డిమాండ్ను అస్సలు పట్టించుకోకుండా అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని జెఎసి ప్రతినిధులు  ఆరోపిస్తూ బాబు కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మొత్తంగా బాబుకి జిల్లాల పర్యటనలు చేదు అనుభవాన్ని మిగుల్చుతున్నాయి. పక్కా ప్లానో లేదా యాదృచ్ఛికమో కానీ.. చంద్రబాబుకు జిల్లాల పర్యటనలు మిగిలిస్తున్న చేదు అనుభవాలు అధికార పార్టీనేతలకి మాత్రం ఆనందాన్ని ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ..ఇంకో నాలుగున్నరేళ్ళు చంద్రబాబు పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *