డిస్కో రాజా మూవీ రివ్యూ

టైటిల్ : డిస్కో రాజా

తారాగణం : రవి తేజ, పాయల్ రాజ్ పుత్, నభానటేష్, తాన్యా హోప్, బాబీ సింహ, సునీల్, వెన్నెల కిశోరె, శిశిల్ శర్మ, సత్య తదితరులు

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : రామ్ తళ్లూరి, రజని తళ్లూరి

ఎడిటింగ్ : శ్రవణ్

సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని

మ్యూజిక్ : థమన్

డైలాగ్స్ : అబ్బూరి రవి

కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వి ఐ ఆనంద్

మాస్ మహారాజ రవితేజ రెగ్యులర్ గా చేసే జోనర్స్ కి ఏ మాత్రం సంభందం లేకుండా, తోలి సారిగా ఒక సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి డిస్కో రాజా సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు, దీనికి తోడు వినూత్న సినిమాల దర్శకుడు వి ఐ ఆనంద్, ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఆడియన్స్ లో ఉన్న ఆసక్తి కాస్తా ఉత్కంఠగా మారింది।రవి తేజ సినిమా అంటేనే ఫుల్ గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఎక్సపెక్ట్ మూవీ లవర్స్ కి డిస్కో రాజా ఏ రేంజ్ లో నచ్చుతాడో చూడాలి

కథ

హెలెన్ (పాయల్ ) ప్రేమ లో పడతాడు డాన్ డిస్కో రాజా (రవి తేజ), హెలెన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న డిస్కో రాజా అంతే పగని సేతు(బాబీ సింహా) పై పెంచుకుంటాడు, అసలు సేతు కి డిస్కో రాజా కి సంబంధం ఏంటి, వీరి మధ్య చిచ్చు రావడానికి కారణం ఎవరు,
సేతుకి బుద్ధి చెప్పడం కోసం డిస్కో రాజా టెక్నాలజీని ఎలా వాడుకున్నాడు, డిస్కో రాజా, హెలెన్(పాయల్) మధ్యలోకి నభ(నభ నటేష్) ఎలా వచ్చింది తదితర వివరాలకి క్లారిటీ రావాలంటే ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే।

విశ్లేషణ

పుట్టిన వాడు గిట్టక తప్పదు, గిట్టిన వాడు మల్లి పుట్టక తప్పదు, ఐతే ఈ చావు పుట్టుకలని రోజు రోజుకి అభివృద్ధి అవుతున్న సైన్స్ సమూలంగా మార్చేస్తుంది, ఈ పాయింట్ ని రవి తేజ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో తీయడం నిజం గా గట్స్ అనే చెప్పాలి, డిస్కో రాజా డైరెక్టర్ వి ఐ ఆనంద్ తీసుకున్న ఈ డెసిషన్ తో సగం విజయం వచ్చేసింది అని చెప్పి తీరాలి. ఈ సినిమా టైటిల్ కి, ఈ సినిమా కథ కి రవి తేజ మాత్రమే సరి పోతారు అని నిస్సందేహంగా చెప్పచు, ఆ స్థాయిలో రవి తేజ నటన, స్క్రీన్ పెర్ఫార్మన్స్ ఉంది, రవి తేజ లో ఉన్న ఎనర్జీ ని వాడుకోవాలే కానీ తద్వారా అయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది అని మరోసారి డిస్కో రాజా ద్వారా రుజువు అయ్యింది, ఒకపాత్రలో అనేక వేరియేషన్స్ ఇచ్చే అతి తక్కువ నటుల్లో రవి తేజ ఒకరు, అయితే డిస్కోరాజా కోసం రవి తేజ రవి తేజ నటన విలక్షణంగా ఉండటమే కాదు చాలా స్టైలిష్ గా కూడా అనిపిస్తుంది, సినిమాలో కనిపించే రెట్రో, ప్రెసెంట్ బ్యాక్ డ్రాప్ లు కి తగ్గినట్లుగా రవి తేజ నటన ఆకట్టుకుంటుంది.

ఒక కమర్షియల్ సినిమా తీయడమే కష్టం అనుకుంటే, ఆ కార్సియాలిటీ కి కంటెంట్ ని జోడించి రెండు గంటల 25 నిముషాల సినిమాలో ప్రతి అరగంటకి ఒకేసారి ఆడియన్స్ థ్రిల్ కి గురిచేస్తూ దర్సకుడు వి ఐ ఆనంద్ డిస్కో రాజా తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, అరగంటకి ఒకేసారి అనే మాట కూడా తప్పే అవుతుంది ఎందు కంటే ఈ సినిమా ప్రథమార్ధం జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టింది, తన రాసుకున్న రిస్కీ కథ కి తగినట్లుగా విజువల్ కూడా ఉండేలా దర్సకుడు ఆనంద్ చాలా జాగ్రత్త పడ్డాడు, దర్సకుడు విజన్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ కూడా చాలా గ్రాండియర్ గా అందించారు, వాస్తవానికి ముందు ఈ సినిమాలో నటి నటులు వాళ్ళు చేసిన పాత్రలు కథ, కథనం గురించి ముందు మాట్లాడాలి కానీ దర్సకుడు ఆనంద్ సినిమాని నడిపించిన విధానం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం మనల్ని మాయ చేస్తాయి, ఈ రేజర్ ఎడ్జె కథ ని నమ్మి ఏ మాత్రం ఖర్చుకి వెనకడుగు వెయ్యకుండా, ఐస్ ల్యాండ్, మనాలి, చెన్నై అలానే భారీ భారీ సెట్టింగ్స్ లో షూటింగ్ కి కావాల్సిన ప్రతిదీ సమకూర్చి పెట్టుబడి పెట్టిన నిర్మాతలు రామ్ తళ్లూరి, రజని తళ్లూరి ప్యాషన్ ని మెచ్చుకోకుండా ఉండలేము, ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చేలా కనిపించడం లో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ముఖ్య కారణం, అలానే వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న థమన్ డిస్కో రాజా కి మరొక బిగ్ అసెట్, పాటలే కాదు రి రికార్డింగ్ తో కూడా థమన్ డిస్కో రాజా కి ఫుల్ కిక్ ఇచ్చాడు.

ఈ సినిమాలో రవి తేజ తరువాత ముఖ్యం గా చెప్పుకోవాలిసిన క్యారెక్టర్ పాయల్ రాజ్ పుత్ పోషించిన హెలెన్ రోల్, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పేస్తే అందులో ఉండే కిక్ పోతుంది అని బయట పెట్టడం లేదు కానీ, రైసింగ్ లో ఉన్న ఒక యంగ్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకోవడమే పాయల్ రాజ్ పుత్ కెరీర్ కి సగం సక్సెస్ అని చెప్పాలి, అలానే సేతు గా నటించిన బాబీ సింహా హీరో కి ఏ మాత్రం తగ్గుకుండా నటించాడు, సునీల్ కూడా తన పరిధిలో ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసాడు, తాన్యా హోప్, నభ నటేష్ పాత్రలు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోయిన్ల మాదిరి గా పాటలకే పరిమతం అవ్వకుండా, కథ తో ట్రావెల్ అయ్యారు, వారి నటన సైతం ఆకట్టుకుంది, వీరితో పాటు వెన్నెల కిషోర్, నరేష్, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు, డిస్కో రాజా సినిమా పూర్తి ఫామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రెడీ అవ్వడం లో నటి నటులు, సాంకేతిక నిపుణల కృషి, ప్రతిభ ఉన్నాయి అని కాన్ఫిడెంట్ గా చెప్పవచ్చు అటు మాస్ ఆడియన్స్ కి ఇటు క్లాస్ జనాలకి ఫుల్ జోష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో డిస్కో రాజా ఫుల్ స్కోర్ చేసేసాడు కంటెంట్ తో పాటు కమర్సియాలిటీ ఉన్న సినిమాలు చాల అరుదు గా రిలీజ్ అవుతుంటాయి, కాబ్బటి డోంట్ మిస్ డిస్కో రాజా

బాటమ్ లైన్ : ఫ్రీకింగ్ హిట్ రాజా

రేటింగ్ : 3.75 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *