ఇప్పుడు అందరి చూపు దేవి శ్రీ ప్రసాద్ మీదే ఉంది. దానికి కారణం దేవి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఈ రోజు మొదటి సింగిల్ వస్తోంది. అవును దేవికి ఇది అతి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కెరీర్ లో ఇంత వరకూ ఈ రేంజ్ లో ప్రెజర్ తీసుకోలేదు దేవి. ‘అల వైకుంఠపురములో’ ఆల్బం ని మించేలా ‘సరిలేరు నీకేవ్వరు’ సాంగ్స్ ఉండాలని ఓ వైపు మహేష్ ఫ్యాన్స్ మరో వైపు మేకర్స్ నుండి గట్టి ఒత్తిడి ఎదుర్కుంటున్నాడు డి.ఎస్.పి.
అందుకే ఇప్పుడు దేవి తమన్ ని దాటే రేంజ్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ కి బెస్ట్ సాంగ్స్ ఇస్తాడా లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ కి బెస్ట్ ఆల్బం ఇస్తానని మాటిచ్చాడు దేవి. సాయంత్రం రిలీజ్ అయ్యే ‘మైండ్ బ్లాక్’ సాంగ్ తో ఆ మాటను నిలబెట్టుకున్నాడా లేదా తేలిపోతుంది. సో దేవి భారీ అంచనాలను అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సాయంత్రం ఐదింటి దాక వెయిట్ చేయాల్సిందే.