వెలిగొండ గోడు తీర్చే యజ్ఞాన్ని చేపట్టిన సీఎం జగన్

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. గురువారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించారు సీఎం జగన్మోహన్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు వెలుగులు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రణాళికలను రూపొందించారు. ఇందులో భాగంగా నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి పురోగతిని సమీక్షించారు.

వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ప్రభుత్వం 5,107కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3,480కోట్లు అవసరం కానున్నాయి. ఇందులో తొలిదశ పూర్తి చేయడానికి 534 కోట్లు, రెండోదశకు 1880కోట్ల అవసరం కానున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సాఆర్ కడప జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. 15.25లక్షల మందికి తాగునీరు అందడంతోపాటు, 4లక్షల47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందించాలని లక్ష్యంతో ముందుకెళుతున్నారు.

కరువు సీమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రైతుల కష్టాలు దగ్గర నుంచి చూసిన జగన్.. ఈ ప్రాంత వాసిగా ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంకల్పించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు. నాటి నుంచి ప్రాజెక్టును పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో అపర భగీరథుడి వలే సాగునీటి ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు వెలుగులు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి తాజాగా తొలిసారి గురువారం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈప్రాజెక్టును పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *