రవిప్రకాష్ కు మూడినట్టేనా?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మేడిపండు గుట్టు వీడుతోంది. ఆ పొట్టలో ఎన్ని పరుగులు ఉన్నాయో ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహించే ‘స్పందన’ అనే ప్రజా ఫిర్యాదుల విభాగానికి రవిప్రకాష్ బాధితులు క్యూ కట్టారు. ఆయన చేసిన మోసంపై ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ‘సంజీవని’ ఆస్పత్రి పేరిట తమ దగ్గర లక్షలు విరాళాలు తీసుకొని ఉచిత వైద్యం అందించకుండా మోసం చేశాడని.. లక్షలు దండుకున్నాడని బాధితులు కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

*ఉచిత వైద్యం పేరిట విరాళాలు
సిలికానాంధ్ర ట్రస్ట్ పేరిట టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పేదలకు ఉచిత వైద్యం అందిస్తానని కూచిపూడిలో ‘సంజివనీ’ ఆస్పత్రిని గతంలో నెలకొల్పాడు. దాదాపు 150 గ్రామాలకు ఉచితంగా ప్రపంచ స్థాయి ఆధునిక వైద్య సేవలను అందిస్తామని కూచిపూడి లో స్థలం కోసం రవిప్రకాష్ బ్యాచ్ స్థానికులను నమ్మించారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి తెలుగు విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న ఎకరం స్థలాన్ని కొట్టేశారని గ్రామస్థులు ఆరోపిస్తుంటారు. దేశ, విదేశాల్లోని ఎన్ఆర్ఐ లను ఈ ఆస్పత్రి కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక రవిప్రకాష్ మాటలను నమ్మి కూచిపూడి స్థానికులు కూడా తమ వంతు విరాళాలిచ్చారు. విదేశాలనుండి వసూలైన విరాళాలతో పాటు స్థానికంగాను, ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ వ్యక్తులు,సంస్థల నుండి మీకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

సంజీవనీ ఆస్పత్రి పేరిట రోగుల జీవితాలతో ఆటలు..
ఇక సంజీవనీ ఆస్పత్రిని స్థాపించి పేదలు, విరాళాలు అందించిన వారికి ఉచిత వైద్యం అందించకుండా.. కనీస మౌళిక సదుపాయాలు అందించకుండా.. రోగుల ప్రాణాలు రవిప్రకాష్ తీస్తున్నాడని బాధితులు ఫిర్యాదులు పేర్కొన్నాడు.తమ నుంచి విరాళాలు తీసుకొని మోసం చేసిన రవిప్రకాష్ అక్రమాలపై విచారణ జరుపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.

స్పందించిన జగన్.. రవిప్రకాష్ పై విచారణకు ఆదేశం..
బాధితుల ఫిర్యాదులపై జగన్ సర్కారు స్పందించింది. దీనిపై సీరియస్ గా విచారణ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ సర్కారు త్వరలోనే సంజీవని ఆస్పత్రి పేరిట రవిప్రకాష్ చేసిన మోసంపై విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందం(సిట్) వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *